calender_icon.png 14 April, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొద్దున్నే ఇది తాగితే!

13-04-2025 12:25:45 AM

హైబిస్కస్ టీ అంటే మందార పూలతో తయారు చేసే టీ. ఇందులో విటమిన్ సీ.. యాంటీ యాక్సిండెట్లు పుష్కలంగా ఉంటాయి. మందార పూలతో చేసిన టీ కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మందారంలో పాలీఫెనాల్స్, ఆల్ఫా గ్లూకోసిడేస్, ఆల్ఫా అమైలేస్ వంటి ఎంజైములు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.

రెగ్యులర్ కాఫీ.. ఛాయ్‌లు తాగితే ఆకలి లేకుండా చేసి.. జీర్ణక్రియ సమస్యలతో పాటు కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. మందార టీ వల్ల జీర్ణక్రియ వృద్ధి చెందడమే కాకుండా.. ప్యాంక్రియాటిక్ లైపేస్ వంటి ఎంజైములు తొలగించడం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.