calender_icon.png 26 October, 2024 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ, కాఫీ తాగితే..

24-10-2024 12:00:00 AM

టీ-కాఫీకి సంబంధించి అనేక అపోహలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో టీ, కాఫీ తీసుకో వడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కానీ టీ, కాఫీలను మోతాదుగా తీసుకుంటే ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపడమే కాకుండా గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.

టీ లేదా కాఫీని క్రమం తప్పకుండా తీసుకునే వ్యక్తులు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వాస్తవానికి కాఫీలో ఉండే కెఫిన్, ఇతర సహజ సమ్మేళనాలు గుండె ధమనులను మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే టీ, కాఫీలను పరిమితంగా తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది. కానీ లెక్కకుమించి తీసుకుంటే అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది. రోజుకు 2 లేదా 3 కప్పుల టీ లేదా కాఫీ తాగొచ్చు.