జీలకరలో అనేక పోషకాలు ఉండటంతో శరీరానికి మంచిదని శాస్త్రీయంగా నిరూపితమైంది. అందుకే జీలకర నీటిని చాలామంది ఆయుర్వేద ఔషధంగా తీసుకుంటారు. ప్రతిరోజూ ఒక గ్లాసు జీలకర నీరు తాగటం వల్ల గుండె, కడుపు, జుట్టు, చర్మం ఆరోగ్యానికి మంచి చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య చర్మాన్ని రాకుండా చేస్తుంది. మొటిమలనూ తగ్గిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక డయాబెటిస్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాదు.. రక్తహీనతకు చెక్ పెడుతుంది.