calender_icon.png 1 April, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడురోజులు ఫోన్ వాడకుంటే!

23-03-2025 12:00:00 AM

స్మార్ట్‌ఫోన్.. ప్రజల పాలిట భూతంలా తగులుకుంది అని చెప్పాలి. లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతుల్లో ఫోన్ ఉండాల్సిందే. అవసరం కొద్దీ వాడేవారికన్నా, అనవసరంగా వాడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎలాంటి విషయం అయిన ఈ ఫోన్ ద్వారా క్షణాల్లో తెలుసుకుంటున్నారు. ఫోన్ ఉంటే ప్రపంచమే మన అరచేతుల్లోకి వస్తుంది. అందుకే ఫోన్ లేకుండా అసలు ఉండలేకపోతున్నారు. అయితే ఒక మూడు రోజుల పాటు ఫోన్ వాడకపోతే ఏమవుతుంది? అనేది తెలుసుకుందాం.. 

కేవలం ఒక మూడు రోజుల అంటే మొత్తం 72 గంటల పాటు ఫోన్‌కి దూరంగా ఉంటే, మెదడు పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉంటుందో రీసెంట్ రిసెర్చ్‌లో వెల్లడైంది. జర్మనీకి చెందిన హీడెల్‌బర్గ్ యూనివర్సిటీ, కోలోన్ యూనివర్సిటీ సంయుక్తంగా దీనిపై అధ్యయనం నిర్వహించింది. 18 ఏళ్ల మధ్య వయసున్న 25 మంది పార్టిసిపెంట్స్ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఓ 72 గంటల పాటు ఫోన్ వాడకాన్ని పరిమితం చేయాలని వీరికి కండిషన్ పెట్టారు.

కేవలం ముఖ్యమైన కమ్యూనికేషన్, వర్క్ టాస్క్‌లకు వాడుకునే మినహాయింపు ఇచ్చారు. ఇక ఆ మూడు రోజుల పాటు వారి బ్రెయిన్ యాక్టివిటీని ట్రాక్ చేశారు. అయితే వారంతా ధూమపానం, మద్యం సేవించకుండా ఎలా కఠినంగా ఉంటారో.. అలాగే ఫోన్ విషయంలోనూ ప్రవర్తించారని తెలింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో చాలామందికి గేమింగ్ అలవాటు ఉంది. వారి ఆహారపు అలవాట్లు, మానసిక స్థితి, డోపమైన్ లేదా సెరోటోనిన్ వంటి మెదడు రసాయనాల స్రావంలో తేడాలు కనిపించాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎక్కువగా ఫోన్ వడేవారిలో అనవసరమైన ఆందోళన, అధిక ఆకలి, మరికొందరిలో సైలెన్స్ డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే అధ్యయనంలో పాల్గొన్న తర్వాత వారిలో మార్పులు కనిపించాయని.. వారి మెదడు దానంతట అదే సాధారణంగా పని చేయగలిగుతుందని.. స్వయంగా నిర్ధారణ అయినట్లు పరిశోధకులు వివరించారు.