calender_icon.png 13 February, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లు అమ్మకుంటే చంపేస్తాం..

13-02-2025 01:42:28 AM

 నయీం అనుచరులమంటూ బెదిరింపులు, దాడి 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): గ్యాంగస్టర్ నయీం మరణించిన తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి నయీం పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఓ కుటుంబానికి నయీం అనుచరులమంటూ బెదిరింపులకు దిగారు. చంపుతామంటూ హెచ్చరించడంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సైదాబాద్ పీఎస్ పరిధిలోని కరణ్‌బాగ్‌లోని లక్ష్మీ అపార్ట్‌మెంట్‌లో వై ప్రకాశ్ కుటుంబం 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు.

అదే అపార్ట్‌మెంట్‌లోని పెంట్ హౌజ్‌లో పీ శ్రీహరి అద్దెకు దిగాడు. క్రమేణా ఆ పెంట్‌హౌజ్‌ను కొని, స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రకాశ్ ప్లాట్‌పై కన్నేసిన శ్రీహరి, అతడి కుమారుడు ప్రసాద్‌తో కలిసి ప్లాట్ అమ్మాలని రెండేళ్లుగా ప్రకాశ్‌ను, ప్రకాశ్ కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వస్తున్నారు. ప్లాట్ అమ్మనని ప్రకాశ్ ఖరాఖండిగా చెప్పడంతో రెచ్చిపోయిన శ్రీహరి, ప్రసాద్ ఈ నెల 9న ప్రకాశ్ ఇంట్లో లేని సమయంలో కూతురు పింకి, భార్య మాధవితోపాటు కుమారుడు శ్యాంసుందర్, అల్లుడు సంతోష్‌లపై దాడి చేశారు.

గర్భిణి అయిన ప్రకాశ్ కోడలును సైతం కొట్టారు. తాము నయీం అనుచరులమని, చాలా హత్యలు చేశామని, మార్చి 30కల్లా ప్లాట్ అమ్మి ఖాళీ చేయకుంటే ఏప్రిల్ నెలలో అందర్నీ చంపేస్తాం అంటూ బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కూడా హెచ్చరించినట్టుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రకాశ్ ఇం  (వారం రోజుల్లో) కుమారుడి పెళ్లి ఉండటంతో ఈ విషయాన్ని  గోప్యంగా ఉంచినట్టుగా తెలుస్తుంది. వారి బెదిరింపులకు తీవ్ర భయబ్రాంతులకు గురైన ప్రకాశ్ కుటుంబ సభ్యులు అతని భార్య సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరి  ఈస్ట్ జోన్ డీసీపీ, సైదాబాద్ ఏసీపీలను కలిసి శ్రీహరి ఆగడాలపై బుధవారం బాధితులు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీహరిని అదుపులోకి తీసుకుని విచారి స్తున్నట్టుగా సమాచారం. శ్రీహరిపై న  హైదరాబాద్, రాచకొండ పరిధిలో పలు కేసులు నమోదైనట్టుగా, పీడీ యాక్ట్ కింద ఏడాది పాటు జైలు జీవితం గడిపి విడుదలైనట్టుగా తెలుస్తుంది.

ఇదిలా ఉండగా, శ్రీహరి కుమారుడు ప్రసాద్ మంగళవారం ప్రకాశ్ కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఫిర్యాదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ విషయంలో పూర్తి స్థాయి సమాచారాన్ని దర్యాప్తు చేసిన తర్వాత తదుపరి చర్య లు తీసుకుంటామని సైదాబాద్ సీఐ రాఘవేందర్ తెలిపారు.