- నర్సింగ్ విద్యార్థినిని వేధిస్తున్న ప్రేమోన్మాది
- హయత్‌నగర్ పీఎస్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు
ఎల్బీనగర్, నవంబర్ 16: తనను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చి చంపుతానని యువతిని ఓ యువకుడు బెదరింపులకు పాల్పడిన ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాగార్జునసాగర్‌కు చెందిన విజయ్‌కుమార్ (26) సికింద్రాబాద్‌లోని సర్దార్ వల్లాబాయ్ పటేల్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు.
డిగ్రీ చదువుతున్న సమయంలో అత డికి ఇన్‌గ్ట్రామ్‌లో హయత్‌నగర్‌కు చెం దిన నర్సింగ్ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతితో కొన్నిరోజులు చనువుగా ఉన్న విజయ్‌కుమార్ కొంతకాలంగా ప్రేమ పేరు తో ఆమెను వేధిస్తున్నాడు. విజయ్ ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి.. అతడిని దూరం పెట్టింది. దీన్నీ భరించలేని విజయ్.. విద్యార్థినిని మరింత వేధించసాగాడు.
కళాశాలకు వెళ్తున్నప్పుడు, బస్టాప్, ఇంటి చుట్టూ తిరుగు తూ వేధిస్తున్నాడు. తనతో మాట్లాడకుంటే.. తనను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చి చంపుతానని యువతిని బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. అలాగే పలుమార్లు బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టేవాడు.
ఈ క్రమంలో ఈనెల 15వ తేదీన హయత్‌నగర్‌లో యువతి ఇంటికి వచ్చి ఆమె తండ్రితో గొడవపడి దాడి చేశాడు. విజయ్ వేధింపులు భరించలేక కుటుంబ సభ్యుల సహకరంతో యువతి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజుగౌడ్ తెలిపారు.