calender_icon.png 18 March, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకోకపోతే ఇబ్బందులు తప్పవు

18-03-2025 12:17:27 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, మార్చి 17 ( విజయక్రాంతి) : అనుమతి లేని, అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోకపోతే ఇబ్బందులు తప్పవని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో ఎల్‌ఆర్‌ఎస్ పేమెంట్ల అంశంపై జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి కలెక్టర్  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అని మున్సిపాలిటీల పరిధిలో అనుమతి లేని, అనధికార లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు.

అటువంటి లేఔట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోవాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పారు. అనధికారిక ప్లాట్లను రెగ్యులరైజ్ చేయించుకోకపోతే  భవిష్యత్తులో వాటిని అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉండదని అన్నారు. కాబట్టి అనుమతి లేని ప్లాట్లను తక్షణమే ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.