- ఓయూ జేఏసీ నేతలకు అల్లు అర్జున్ ఆర్మీ, ఫ్యాన్స్ పేరుతో ఫోన్‌కాల్స్
- ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన నేతలు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో ఆ చిత్ర హీరో అల్లుఅర్జున్ నివాసంపై దాడి చేసిన ఓయూ జేఏసీ నేతలకు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో తమకు రోజూ వందల ఫోన్‌కాల్స్ వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఆదివారం వారు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ నివాసంపై దాడిచేసినందుకు అల్లు అర్జున్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలని, అలా చేయకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తమ ఫోన్ నంబర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఫోన్‌కాల్స్ ఆగకుంటే వేలాది మంది విద్యార్థులతో కలిసి మరోసారి అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. తమను బెదిరి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఓయూ జేఏసీ నేతలు సంధ్య ధియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఇటీవల అల్లు అర్జున్ నివాసంపై దాడిచేసి ఇంటి ఆవరణలోని పూల ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వారిని పోలీ అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వారంతా బెయిల్‌పై ఉన్నారు.