calender_icon.png 11 January, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలా చేస్తే.. మతిమరుపు మాయం

07-10-2024 12:00:00 AM

వయసు పైబడిన వారిలో జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి తగ్గిపోవడం జరుగుతుంటాయి. దానినే డిమెన్షియా అంటారు. ఈ లక్షణాలతో పాటు భాష మర్చి పోవడం, ఆలోచించలేకపోవడం, ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే, ఈ రోజుల్లో 30 ఏళ్లు పైబడిన వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

రీసెంట్‌గా జరిగిన విషయాలు మర్చిపోవడం, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం, చెప్పిందే చెబతూ.. చెసిందే చేస్తూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. దేని మీదా ఇంట్రెస్ట్ పెట్టలేరు. కాస్త కఠినమనిపించే పనులు కూడా చేయలేరు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బందులు, కన్‌ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మానసిక వైద్యుడ్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. 

జాగ్రత్తలు..

సమతుల్య ఆహారం తీసుకోవాలి. పొగ తాగడం, మద్యం సేవించడం వంటివి చేయకూడదు. మైండ్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. అందరితో మాట్లాడటం, సంగీతం వినడం వంటివి చేయాలి. వ్యాయామాలు, ధ్యానంతో పాటు ఇంకా ఇతర రోజూవారి పనుల్లో చురుగ్గా పాల్గొనాలి.