calender_icon.png 19 September, 2024 | 7:29 AM

మాట వినకుంటే సైట్‌ను మూసేస్తాం

07-09-2024 02:03:40 AM

  1. వికీపీడియాను మందలించిన ఢిల్లీ హైకోర్టు 
  2. ఏఎన్‌ఐ వార్తా సంస్థ పరువు నష్టం కేసులో కీలక వ్యాఖ్యలు

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 6: తమ సంస్థ ప్రతిష్టకు  భంగం కలింగించేలా నిరాధార ఆరోప ణలతో సమాచారాన్ని రాయడాన్ని ఖండిస్తూ.. ఏఎన్‌ఐ సంస్థ యాజమాన్యం వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది. ఈ కేసుకు సంబంధించి గురువారం వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘భారత న్యాయవ్యవస్థ ఆదేశాలు పాటించకుంటే దేశంలో వికీపీడియా సైట్‌ను మూసివేయమని ప్రభుత్వా న్ని ఆదేశిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

మీకు నచ్చకపోతే ఇక్కడ మీ కార్యకలాపాలు మూసివేయండి’అని ఘాటు వ్యాఖ్యలు చేసి ంది. ఇటీవల వికీపీడియా తన పేజీలో ఏఎన్‌ఐ సంస్థ ప్రస్తుత ప్రభుత్వానికి ‘ప్రచార సాధనం’గా మారిందని పేర్కొంటూ సమాచారం రాసిందని ఆ వార్తా సంస్థ తెలిపింది. దీనిని ఖండిస్తూ ఏఎన్‌ఐ సంస్థ తమ పరువుకు భంగం కలిగించేలా రాతలు రాసిన వికీపీడియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

వికీపీడియా తన ప్లాట్‌ఫామ్‌లో సవ రణలు చేసుకోవడానికి ఎవరికైనా అనుమతి ఇస్తోందని.. ఈ ఆప్షన్ వల్ల.. సంస్థల, వ్యక్తుల పరువుకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఏఎన్‌ఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.