మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్, జనవరి 13 (విజయ క్రాంతి) : అభివద్ధి కేవలం మాటలకు మాత్రమే పరిమితమైతే జరగదని కష్టపడి పనిచేస్తేనే సాధ్యమవుతుందని మాజీ మం త్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల మండలం, మాచారం గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ సి.రవి నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించి, సిఎల్‌అర్ ద్వారా సమకూర్చిన ఉచిత గ్యాస్ సిలిండ ర్లను పేదలకు అందజేశారు. ఈ సంద ర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజ లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని తెలిపారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎల్లప్పుడూ అందుబా టులో ఉండి సేవ చేస్తానని భరోసా కల్పిం చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయ కులు ఉన్నారు.