calender_icon.png 26 February, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్ముంటే రాజీనామా చేసి పోటీచెయ్!

26-02-2025 01:52:06 AM

 సీఎంకు బీజేపీ ఎంపీ డీకే అరుణ సవాల్

కామారెడ్డి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): దమ్ముంటే రాజీనామా చేసి కొడంగల్ నుంచి తిరిగి పోటీచేసి గెలవాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ సవాల్ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిచ్కుందలో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

కాంగ్రెస్ ఓటమి భయంతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. కాంగ్రెస్ మోసాలను చట్టసభల్లో ప్రశ్నించేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

గ్రాడ్యుయేట్స్‌ను, ఉపాధ్యాయులను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బీబీపాటిల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు అరుణతార, పెద్దోళ్ల గంగారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.