calender_icon.png 16 January, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమాలపై ఫిర్యాదు చేస్తే విచారిస్తాం

23-09-2024 12:07:00 AM

కేటీఆర్‌కు మీడియా ఫోబియా

ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఎంఐఎం..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కేటీఆర్‌కు మీడియా ఫోబియా సోకిందని, అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పే ర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని 57వ డివిజన్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఓటుకు నోటు కేసు విచారణ జరగలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, కొంతమంది మంత్రు లు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తాము హైడ్రాకు వ్యతిరేకం కాదని, నిష్పాక్షికంగా కూల్చివేతలు జరగాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలకు కారణమైన బీఆర్‌ఎస్ నేతలపై చర్యలు తీసుకోవా లన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగడం హిందూ ధర్మంపై దాడిగా అభివర్ణించారు. లడ్డూ కల్తీ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టిసారించారని అన్నారు.

టీటీడీలో అన్యమతస్తులకు చోటు కల్పించకూడదన్నారు. ఎంఐఎం నేతలు ఇప్పటికీ జాతీ య గీతం ఆలపించరన్నారన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషించేది ఎంఐఎం పార్టీ అని ఆరోపించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు కేంద్రం కట్టుబడి ఉన్నదన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సభ్యత్వ నమోదు వేగంగా జరుగుతుం దని బండి సంజయ్ పేర్కొన్నారు. 

రాజేందర్ కుటుంబానికి పరామర్శ

మంథని/మహాదేవపూర్: భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్ సభ్యత్వ నమోదు నిర్వహిస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించా రు. అన్ని విధాల అండగా ఉంటానని భ రోసా కల్పించారు. పార్టీపరంగా ఆర్థిక సహాయం అందజేశారు. బండి సంజయ్‌కు మంథనిలో పెద్దపల్లి జిల్లా అధ్య క్షుడు సునిల్‌రెడ్డి స్వాగతం పలికారు.