01-04-2025 01:59:52 AM
స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ మార్చి 31 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తెలకపల్లి, తాడూర్, బిజినపల్లి, తిమ్మాజిపేట, నాగర్ కర్నూల్ గ్రామపంచాయతీలో తాగునీటి సమస్య పట్ల ఫిర్యాదులు వస్తే వెంటనే ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్, బదిలీబేటు తప్పదని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మీడియా ద్వారా ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎండలు మండుతున్న వేళ , ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని బోరు మోటర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఓవర్ హెడ్ ట్యాంక్ లను శుభ్రపరచాలని సూచించారు. రాత్రిళ్ళు విషసర్పాలు సంచరించే అవకాశం ఉంటుందని విద్యుత్ స్తంభా లకు విద్యుత్ దీపాలను సరిచేయాలన్నారు. రాజకీయ నాయకులను కాకా పట్టడం మా ని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. లేదంటే ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు.