వాటర్ ట్యాంకర్ల యజమానులకు జలమండలి ఎండీ హెచ్చరిక
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): వాటర్ ట్యాంకర్ల బుకింగుల్లో యజమానులు, డ్రైవర్లు అక్రమాలకు పాల్పడితే ట్యాంకర్లను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతామని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం జలమండలి ఈడీ మయాంక్ మిట్ట కలిసి, ఐటీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది కాలంగా అత్యధిక సంఖ్యలో వాటర్ ట్యాంకర్లు బుక్ అయ్యాయని, ఇదే సమయంలో 40 మంది అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించినట్లు తెలిపారు.
ట్యాంకర్ బుక్ చేసుకోలేని వారి క్యాన్ నంబర్లను గుర్తించి, వారి క్యాన్ నంబర్‌కు వాటర్ ట్యాంకర్ల డ్రైవర్ల నంబర్లు అనుసంధానం చేసి వినియోగదారుడి అవసరాల కోసం బుక్ చేసి, బ్లాక్‌లో అమ్ముకున్నట్లు గుర్తించామని వెల్లడించారు.
ఒక్కో క్యాన్‌నంబర్‌పై వందకు పైగా ట్యాంకర్లు బుక్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇదే అంశంపై లోతుగా అధ్యయనం చేసి వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. కాగా ‘జలమం కొత్తరకం దందా..’
ఒకరి పేరిట బుకింగ్.. మరొకరికి సప్లు అనే శీర్షికన ఈ నెల 4న విజయక్రాంతి దిన కథనం వచ్చిన విషయం తెలిసిందే.