calender_icon.png 19 January, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒరిజినల్ ఐడీతో చాట్ చేస్తే..

11-08-2024 12:21:38 AM

పర్సనల్ లైఫ్‌లో ఇప్పటికీ ఎలాంటి రిలేషన్‌షిప్ మెయింటేన్ చేయటం లేదని పలుమార్లు చెప్పిన శ్రద్ధా కపూర్ తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా, శ్రద్ధ చెప్పిన జవాబు నెట్టింట వైరల్ అవుతోంది. ‘పక్కింటి ఆంటీ దయచేసి ఒరిజినల్ ఐడీతో చాట్ చేయండి..’ అంటూ సరదాగా వ్యాఖ్యానించిన శ్రద్ధ పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు ‘ఒరిజినల్ ఐడీతో చిట్‌చాట్ చేస్తే పెళ్లి గురించి చెప్తుందా? అని చర్చించుకుంటున్నారు.

కొంత కాలంగా బాలీవుడ్‌లో వరుస పెళ్లి బాజాలు మోగుతున్నా, ఆ జాబితాలో శ్రద్ధా కపూర్ పేరు లేకపోవటం చూసిన అభిమానులు.. ఆమెతో పెళ్లి విషయాన్ని ప్రస్తావించటంపై శ్రద్ధ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, శ్రద్ధా ఇటీవల ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో సాంగ్ విడుదల చేసింది. ‘మనుషులే కాదు.. స్త్రీ అందాన్ని చూసి తోడేలు కూడా మురిసిపోతుంది’ అంటూ వ్యాఖ్యల్ని కూడా జోడించింది. శ్రద్ధ నటించిన ‘స్త్రీ2’ చిత్రంలోని ‘ఖూబ్ సూరత్’ అనే పాటే ఇది. ఈ గీతంలో వరుణ్, శ్రద్ధ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.