calender_icon.png 28 December, 2024 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ గాలి పీల్చితే అంతే!

04-11-2024 01:07:54 AM

  1. ప్రమాదకర స్థాయికి ఢిల్లీ వాయు కాలుష్యం
  2. 500 మార్కును దాటేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్

న్యూఢిల్లీ, నవంబర్ 3: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత అంతకంతకూ పడిపోతోంది. దీనికితోడు రెండ్రోజులుగా నగరవా సులు దీపావళి వేడుకల్లో పటాకులు కాల్చడంతో ఎయిర్‌క్వాలీటీ అధ్వానంగా తయారైం ది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని బురారీలో ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 364గా నమోదైంది.

అలాగే న్యూ మోతీబాఘ్, ఆర్‌కే పురం, వివేక్ విహార్, ద్వారకా సెక్టార్-8, లోధి రోడ్‌లో వరుసగా 352, 380, 388, 385, 330గా నమోదైంది. ఈస్థాయి ఢిల్లీలో నివసించే ప్రజల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఈ గాలి పీల్చితే శ్వాసకోశ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

పొగధాటికి కనిపించని తాజ్‌మహల్

ఆగ్రా, నోయిడాతో పాటు ఢిల్లీ ఎన్సీఆర్‌లో దట్టంగా పొగ కమ్ముకుంది. కాలుష్యం ధాటికి తాజ్‌మహల్ కనిపించకుండా పోయింది. యమునా నురగలు కక్కుతున్నది. పెద్దమొత్తంలో నురగ ప్రవహిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ప్రకారం.. అలీపూర్, ఆనంద్ విహార్, బురారీ, మధుర రోడ్, ఐజీఐ విమానాశ్రయం, ద్వారక, జహంగీర్‌పురి, ముండ్కా ప్రాంతాల్లో గాలి నాణ్యత తగ్గిపోయింది. 

ఏక్యూఐ లెవల్స్ ఏ మేరకు మంచివి?

ప్రమాణాల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సున్నా నుంచి 50 మధ్య ఉన్నప్పుడు ‘మంచి’గా పరిగణించబడుతుంది. 51 నుంచి 100 మధ్య ఉన్నప్పుడు అది ‘సంతృప్తికరమైన’ విభాంగంలో ఉంటుంది. ఏక్యూఐ 101-200 మధ్యలో ఉంటే అది మిమైనదని అర్థం. 201-300 మధ్యలో ఉంటే అది ‘చెడు’గా పరిగణించబడుతుంది. ఒకవేళ 301-400 మధ్యలో ఉంటే అది ‘చాలా చెడు గాలి’గా పరిగణిస్తారు.