10-04-2025 12:00:00 AM
నల్లాకు మోటర్ బిగిస్తే కనెక్షన్ కట్
తక్షణమే మోటర్ సీజ్, జరిమానా
జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): వినియోగదారులు మోటార్ల తో నల్లాల నుంచి నీటిని లాగితే కఠిన చర్య లు తీసుకుంటామని జలమండలి ఎండీ అ శోక్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓ అండ్ ఎమ్ సీజీఎం, జీఎంలతో సమీక్ష నిర్వహించారు. టార్గెట్ ‘మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ దిశగా ముందుకు సాగాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లాకు మోటర్ బిగిస్తే తక్షణమే కనెక్షన్ తొలగించి, మోటర్ సీజ్ చేసి, రూ.5 వేలు జరిమానా విధించాలని ఆదేశించారు. వేసవిలో తాగు నీటి ఎద్దడి ఏర్పడ కుండా ఉండేందుకు సాధ్యమైన అన్ని మా ర్గాలపై జలమండలి ప్రత్యే దృష్టి సారించిందన్నారు. ఈ సమావేశంలో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, ఈఎన్సీ- ఆపరేషన్ డైరెక్టర్ -2 విఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ డైరెక్టర్ -1 అమరేందర్ రెడ్డి, సీజీఎంలు, జీఎం లు, డీజీఎంలు తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 15 నుంచి స్పెషల్ డ్రైవ్
వేసవి నేపథ్యంలో ‘మోటర్ ఫ్రీ టాప్ వా టర్’ లక్ష్యంగా నాలుగు దశల తనిఖీలకు జలమండలి సిద్ధమైంది. నల్లా నీటి సరఫరాలో లో ఒత్తిడికి చెక్ పెట్టి సాధారణ స్థాయి ఒత్తిడితో నీటి సరఫరా జరిగే విధంగా ‘మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ పేరుతో ఈ నెల 15 నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. క్షేత్ర స్థాయిలో నల్లానీటి సరఫరా సమయంలో లైన్‌మెన్ నుంచి ఎండీ వరకు పర్యటించి తనిఖీలు నిర్వహించనున్నారు. వేసవి ముగిసే వరకు ఆకస్మిక తనిఖీ లు కొనసాగనున్నాయి. మోటర్ ఫ్రీ టాప్ వాటర్ సర్వేలో ఏ స్ధాయిలో కూడా సమగ్ర పరిశీలన జరపకుండ తప్పుడు నివేదిక సమర్పిస్తే మాత్రం ఆ స్థాయి అధికారి పనితీరు అంచనా వేసి ర్యాంకింగ్ విధించడం తోపాటు మోమోను జారీ చేయాలని జలమండలి నిర్ణయించింది. అదేవిధంగా ప్రధా న కార్యాలయంలో ఏర్పాటు చేసే డ్యాష్‌బోర్డులో ఆన్‌లైన్ ఆధారంగా ప్రతిరోజు నివేదిక లను పర్యవేక్షిస్తారు.
ప్రత్యేక యాప్ రూపకల్పన
నల్లాలకు మోటార్లను బిగించి వారికి జరిమానా విధించడానికి, జలమండలి సరఫరా చేస్తున్న నీటిని తాగు నీటికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైన మొబై ల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా నీటి నల్లాలకు మోటార్లను బిగించినా, తాగడానికి కాకుండా ఫ్లోర్లు కడగడం, వాహనాలు శుభ్రం చేయడం, గార్డెనింగ్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఓవర్ ఫ్లో, నిర్మా ణ పనుల కోసం నీటిని వృథాచేస్తే జరిమానా విధించడానికి ఈ యాప్‌ని రూపొం దించారు. రెండు రోజుల్లో ఈ యాప్ ని జీ ఎంనుంచి క్షేత్ర స్తాయిలోని లైన్ మెన్ల వరకు అందరికి అందుబాటులోకి తెస్తారు.