calender_icon.png 25 October, 2024 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిగా తిన్నారో.. అంతే సంగతి

25-10-2024 12:00:00 AM

సీజనల్‌గా లభించే సీతాఫలం పండ్లు అంటే అందరూ ఇష్టంగానే తింటారు. రుచిగా ఉండటంతో పాటు ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని, కేవలం సీజన్‌లో మాత్రమే దొరుకుతుందని వీటిని అతిగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నావారవుతారు. అతిగా సీతాఫలం తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలియాలంటే ఓ లుక్కేయండి. 

రుచిగా ఉండే సీతాఫలంలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజ పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని భావిస్తారు. కానీ ఇలా అనుకుంటే పొరపాటే అని నిపుణులు అంటున్నారు. అతిగా సీతాఫలం తింటే దగ్గు, జలుబు దీర్ఘకాలికంగా బాధపడతారని నిపుణులు అంటున్నారు.

చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ పండ్లను తింటే శరీరంపై ఎర్రటి దద్దర్లు, దురద వచ్చే ప్రమాదం ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు సీతాఫలాలను అతిగా తినకూడదు. సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

కడుపు సంబంధిత సమస్యలో బాధపడేవారు వీటిని అతిగా తీసుకోవడం వల్ల సమస్య తీవ్రం అవుతుంది. అలాగే విరేచనాలు, వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నరాల సమస్యలు, డయాబెటిస్, ఆస్తమాతో ఇబ్బంది పడేవారు సీతాఫలాలను తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.