calender_icon.png 9 November, 2024 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్లివ్వాలని కోరితే కళ్లలో కారం కొట్టారు!

31-08-2024 03:49:07 AM

  1. పాలమాకుల గురుకుల విద్యార్థినుల ఆందోళన 
  2. సీఎం రావాలని పెద్దఎత్తున నినాదాలు 

రాజేంద్రనగర్, ఆగస్టు 30: నీటి సమస్యను తీర్చి, అన్ని అవసరాలకు సరిపడా నీళ్లివ్వాలని కోరితే పాఠశాల సిబ్బంది తమ కళ్లలో కారం కొట్టారని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల కస్తూర్భాగాంధీ పాఠశాల విద్యార్థినులు తెలిపారు. శుక్రవారం బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆం దోళన నిర్వహించారు. గురుకులంలో పురుగుల అన్నం పెడుతుతున్నారని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ మాధవి ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. నీటి సమస్యను తీర్చాలని కోరితే సిబ్బంది కళ్లలో కారం పొడి కొట్టారని బోరున విలపించారు. ఉపాధ్యాయులను ఆంగ్లంలో బోధన చేయాలని కోరితే టెన్త్ క్లాస్‌లో ఫెయిల్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. సీఎం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. డీఈవో సుశీందర్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.