calender_icon.png 8 January, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు గ్యారెంటీలు అడిగితే ఆరు కేసులా?

05-01-2025 01:06:55 AM

* రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా

* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

సిరిసిల్ల, జనవరి 4 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుపై నిలదీసినందుకు తనపై ఆరు కేసులు నమోదు చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ  నెరవేర్చాలని కోరినందుకు తనపై అక్ర  కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన సీఎంను ప్రజలు అసహ్యిం   రుణమాఫీ పూర్తిస్థా  అమలైనట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి విస్మరించారన్నారు.

రైతులను దొంగలుగా చిత్రీకరీంచే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కాళేశ్వరం పగుళ్లు కాంగ్రెస్ కుట్రనే తప్పా ఎలాంటి తప్పిదం జరగలేదన్నారు. కోటిన్నర ఎకరాలకు నీరు ఇవ్వాల్సి వస్తుందనే ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం లేదని ఆరోపించారు. అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్లీ వస్తాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలు భయ  అవసరం లేదన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తియినా కాంగ్రెస్ ఇంకా కేసీఆర్ జపం చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి పాల్గొన్నారు.