calender_icon.png 2 April, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెంగుమనీ నువ్వట్టా నడిచొస్తుంటే..

01-04-2025 02:39:05 AM

నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న యాక్షన్- ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ కథానాయిక కాగా.. విజయశాంతి ఐపీఎస్ అధికారిగా కీలక పాత్ర పోషించారు. సోహైల్‌ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా ‘నాయాల్ది’ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ‘చుక్కల చీర చుట్టేసి గజ్జల పట్టీలు కట్టేసి చెంగుమనీ నువ్వట్టా నడిచొస్తుంటే.. చక్కెరలా నీ నవ్వే ముక్కెరపై మెరిసిందే.. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా నను తాకిందే.. సుందరి నీ చూపుతో చిందరవందర చేసేశావే.. వాలు కళ్లా వయ్యారమా.. సింగారం నీ సొంతమా..’ అంటూ సాగుతోందీ గీతం. ఈ పాట కళ్యాణ్‌రామ్, సయీ మంజ్రేకర్ మధ్య సిజలింగ్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేసింది.

అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ఈ గీతానికి రఘురామ్ సాహిత్యం అందించారు. నకాశ్ అజీజ్, సోనీ కొమండూరి ఆలపించారు. ఈ చిత్రానికి డీవోపీ: రామ్‌ప్రసాద్; ఎడిటర్: తమ్మిరాజు; ఆర్ట్: బ్రహ్మ కడలి; యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్; స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా.