calender_icon.png 29 November, 2024 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమలో ఉంటే లోపాలే కనిపించవు

29-11-2024 12:10:47 AM

రిలేషన్‌షిప్ గురించి బాలీవుడ్ నటి అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే తన రిలేషన్‌షిప్ వ్యవహారంపై ఎప్పుడూ ఓపెన్ అయ్యింది లేదు. కానీ అభిమా నులు మాత్రం ఆమె ఎవరితో డేటింగ్‌లో ఉందనే విషయంపై నజర్ పెడుతూనే ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్ వ్యవహారంలో తాను ఎలా మునిగితేలుతుందనే విషయాలను వెల్లడించారు. “గతంలో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలో అతని కోసం ఎంతో మారాను. ఎన్నో విషయాల్లో రాజీ పడ్డా.

రిలేషన్‌షిప్ ప్రారంభమైనప్పుడు ఎదుటి వ్యక్తి మెప్పించడం కోసం, వారి దృష్టిని ఆకర్షించడం కోసం ఏదైనా చేయాలనిపించడమే కాదు.. ఎంత మారినా తప్పు లేదనిపిస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలేవీ కనిపించవు. పైగా ఏదీ మనకు సమస్య కాదనిపిస్తుంది. బంధం విడిపోయినప్పుడే అన్నీ రంగులు మనకు తెలుస్తాయి” అని అనన్యా పాండే తెలిపారు. ‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వక పోవడంతో నిరాశ చెందారు. ఇటీవల ‘సీటీఆర్‌ఎల్’తో విజయం అందుకున్న అనన్య.. ప్రస్తుతం ‘శంకరా’ చిత్రంలో నటిస్తున్నారు.