విప్ బీర్ల అయిలయ్య
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనను కేటీఆర్ ఓర్చుకోవడం లేదని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విమర్శించారు. సీఎంపై అనవసరమైన విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామని కేటీఆర్‌ను అయిలయ్య హెచ్చరించారు. కేటీఆర్‌ది పబ్, డ్రగ్ కల్చరని ఆరోపించారు. కేటీఆర్ లాగ సీఎం రేవంత్‌రెడ్డి దుబాయ్‌కి వెళ్లి ఎంజాయ్ చేయడం లేదని విమర్శించారు. మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు తేవడానికి ఢిల్లీకి వెళితే ఇక్కడి నుంచి నిధులు పంపుతున్నారని కేటీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.