calender_icon.png 4 December, 2024 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే నాలుక కోస్తాం

15-09-2024 01:11:29 AM

  1. బీఆర్‌ఎస్ నేతలకు జగ్గారెడ్డి హెచ్చరిక 
  2. పొడవటానికి వస్తే ఊరుకుంటామా? 
  3. ఆంధ్రా ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చింది మీరే  

హైదరాబాద్,సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి): ‘సీఎం రేవంత్ రెడ్డిని పనికిరాని వాడని విమర్శిస్తే నాలుక కోస్తం, కేటీఆర్ కానీ, వాళ్ల అయ్యగాని ఎవరన్నా సరే నాలుక ఉండదు. మా  పార్టీ కార్యకర్తలను రెచ్చగొ ట్టొద్దు జాగ్రత్త’ అని బీఆర్‌ఎస్ నేతలను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చ రించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థి కత్తితో పొడవటానికి వస్తే ఎవరైనా ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్‌దే, అందుకు ఎదురుదాడి చేస్తున్నారు.. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి చేసేది కరక్టే అని అన్నారు.

హరీశ్‌రావును ఎలుగుబంటి  కరిచినట్లుగా ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా చిల్లరగా వ్యవహరించరని తెలిపారు. ఆంధ్రా ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకుని టికెట్లు ఇచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాకనే రాజకీయ విలువలు దిగజారిపోయినట్లు చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుడు మొదలైందన్నారు. పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది కేసీఆరేనని, చివరకు సీఎల్పీని కూడా విలీనం చేసుకున్నారని చెప్పారు.

బీజేపీ డైరెక్షన్‌లోనే కాంగ్రెస్‌కు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని దుయ్యబ ట్టారు. కేసీఆర్ పూర్వీకులు విజయనగరం నుంచి తెలంగాణకు వచ్చారని, అందుకే కేటీఆర్‌కు ఆంధ్రభాష వచ్చిందని ఆరోపించారు. కేటీఆర్ తెలంగాణలో పాలన చేశారని, భాష మాత్రం ఆంధ్ర భాషనే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సందుల్లో దూరాలని బీజేపీ వచ్చిందని ఆయన విమర్శించారు.