calender_icon.png 20 September, 2024 | 4:59 PM

లంచం అడిగితే పని పడతాం

07-09-2024 01:20:47 AM

సీఎండీ ముషారఫ్ ఫారూఖీ వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఎస్పీడీసీఎల్ కృషి చేస్తోందని, కానీ తమ శాఖలోని కొందరు అవినీతి అధికారుల వల్ల సంస్థకు చెడ్డ పేరు వస్తోందని ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారుఖీ పేర్కొన్నారు. శుక్ర వారం ఆయన మాట్లాడుతూ.. తమ సంస్థ పరిధిలోని ఏ అధికారైనా లంచం అడిగితే 040 4884, 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యా దు చేయాలని సూచించారు.

దీంతో వినియోగదారుల ఫిర్యా దులను నేరుగా తెలుసుకొని, అక్రమాలకు చెక్ పెట్టే వీలుంటుందన్నారు. నూతన సర్వీసుల మంజూరు, కేటగిరీ మార్పు, టైటిల్ ట్రాన్స్ ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి సేవల ను పొందేందుకు సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 

భద్రతా చర్యలు పాటించాలి 

11 రోజుల పాటు నిర్వహించే గణేశ్ ఉత్సవాల సందర్భంగా మండపాలకు నిరంతర విద్యుత్ సరఫరాకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. శుక్రవారం ఆయన విద్యుత్ సరఫరా, భద్రతాచర్యలపై శాఖా పరంగా తీసుకుం టున్న చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ కల్పిస్తున్నట్లు చెప్పారు.

విద్యుత్ సిబ్బంది, సెక్షన్ అధికారులు తమ పరిధిలో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించి, విద్యు త్ పరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. మండపాల నిర్వాహకులు విద్యుత్ పరంగా ఎలాంటి   ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు పాటించాలని పేర్కొన్నారు.