12-02-2025 01:42:31 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: భారత్‌లో ప్రస్తుతం ఉన్న వెయ్యి కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్‌కు మరో వెయ్యి కిలోమీటర్ల నెట్‌వర్క్ జో డిస్తే.. అత్యధిక మెట్రో నెట్‌వర్క్‌ను కలిగిన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానానికి చేరుతుంది. ప్రస్తుతం చైనాలో 10వేల కిలోమీటర్లకుపైగా మెట్రో నెట్‌వర్క్ అందుబా టులో ఉండగా.. అమెరికాలో 1389 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్ ఉంది.
ప్రధాని మోదీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ మరో వెయ్యి కిలోమీటర్ల మేర మెట్రో సేవలను విస్తరించే ందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొ న్నా రు. ఇదే జరిగితే అత్యధిక మెట్రో నెట్‌వర్క్ ఉన్న దేశాల జాబితాలో అమెరికాను పక్కకు నెట్టి దాని స్థానాన్ని భారత్ ఆక్రమించే అవకాశం ఉంది.