అక్కినేని నాగేశ్వరరావు డ్యుయెల్ రోల్ పోషించిన చిత్రం ‘ఇద్దరు మిత్రులు’. ఆదుర్తి సుబ్బారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజసులోచన, ఈవీ సరోజ, గుమ్మడి, పద్మనాభం, రేలంగి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజయ్, విజయ్ అనే పాత్రలలో అక్కినేని నటించారు. అజయ్, విజయ్ అనే ఇద్దరు ఓ ప్రమాదంలో కలుసుకోవడంతో సినిమా ప్రారంభమవుతుంది.
అజయ్ ఒక వ్యాపారవేత్త కుమారుడు. తండ్రి మరణాననంతరం మేనేజర్ అతని సంపదనంతా దోచుకుని అజయ్‌ను అప్పుల పాలు చేస్తాడు. విజయ్ బాగా చదివి నిరుద్యోగంతో బాధపడుతుంటారు. విజయ్ కుటుంబ కష్టాలు పడుతుంటారు. వీరిద్దరూ ఓ ప్రమాదంలో కలుసుకుంటారు. ఒకరి కష్ట సుఖాలు మరొకరు తెలుసుకుని ఒకరి పాత్రలోకి మరొకరు వెళతారు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ఇద్దరూ సమస్యల నుంచి గట్టెక్కారా.. లేదా? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఆ తరువాత ఇలాంటి కథాంశంతో ఒకట్రెండు చిత్రాలు వచ్చినా కూడా ఈ సినిమా స్థానం దీనిదే.