టెస్లా ఓనర్‌కి గవర్నమెంట్‌లో కీలక పదవి అంటూ యూఎస్‌లో చర్చ
న్యూయార్క్, సెప్టెంబర్ 3: అగ్రరాజ్యం యూఎస్‌ఏలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంపూర్ణ మద్దతు అందిస్తున్నారు. ఆయనపై జరిగిన కాల్పులను ఖండించిన మస్క్, జేడీ వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని ప్రశంసించారు. ట్రంప్ సైతం తాను గెలిస్తే మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తానంటూ ఇదివరకే ప్రకటించారు. క్యాబినెట్‌లో అవకాశం కల్పించడమా లేక సలహాదారుడిగా నియమించే విషయమై ట్రంప్ ఇదివరకే స్పష్టతనిచ్చారు.
తాజాగా మరో అంశం తెరమీదకు వచ్చింది. ఫెడరల్ ఏజెన్సీల్లో ఆడిటింగ్ చేసేందుకు మస్క్‌తో పాటు మరికొందరు ఉన్నతస్థాయి వ్యాపార నిపుణులను చేర్చుకోవాలని డొనాల్డ్ భావిస్తు న్నట్లు తెలుస్తోంది. ఈ పదవిపై టెస్లా సీఈవో మస్క్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. ‘నేనింకా వేచి చూడలేను. గవర్నమెంట్‌లో అనవరమైన వృథా, నియంత్రణలు ఉన్నాయి. వాటిని తొలగించాలి’ అంటూ తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ప్రజల వాదనకు బలం చేకూరుతుంది. తనను క్యాబినెట్‌లోకి తీసుకుంటానన్న ట్రంప్ ప్రతిపాదనపై సైతం మస్క్ గతంలో సానుకూలంగా స్పందించారు.