calender_icon.png 7 October, 2024 | 10:44 AM

కాలాన్ని వెనక్కి తీసుకెళ్తే..

07-10-2024 12:05:15 AM

సాయి రోనక్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రివైండ్’. కళ్యాణ్ చక్రవర్తి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ క్రాస్‌వైర్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ నాగి, కేఏ పాల్‌రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేశ్, భరత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈనెల 18న సినిమా ప్రేక్షకులు ముందుకువస్తున్న నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో సాయి రోనక్ మాట్లాడుతూ.. ‘మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మమ్మల్నీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. హీరోయిన్ అమృత చౌదరి మాట్లాడుతూ.. బిగ్ స్క్రీన్ మీద నాకు ఇది ఫస్ట్ సినిమా. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది.  ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

‘కొత్త టీమ్‌గా అందరం పని నేర్చుకుంటూ కష్టపడి సినిమా తీశాం’ అని ఎడిటర్ తుషార పాలా చెప్పారు. చిత్ర దర్శకనిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. “టైమ్ ట్రావెల్ మీద తీసిన లవ్, సై ఫై జోనర్ మూవీ ఇది. టైమ్ ట్రావెల్ మీద వచ్చే సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. మా ‘రివైండ్’ కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా” అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశీర్వాద్; పాటలు: రవివర్మ ఆకుల; సినిమాటోగ్రఫీ: శివరామ్ చరణ్.