calender_icon.png 24 October, 2024 | 6:00 AM

ఈ విటమిన్ లోపిస్తే..

11-06-2024 12:00:00 AM

ఈ రోజుల్లో చాలామంది మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారు. మెగ్నీషియం లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది. మెగ్నీషియం లోపిస్తే, కండరాల నొప్పులు, పట్టేయడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. మెగ్నీషియం లోపం అధికంగా ఉంటే.. అధిక ఒత్తిడి, డయాబెటిస్, కరోనరీ ఆర్జరీ వ్యాధి, బోలు ఎముకల వ్యాధి ముప్పు పెరుగుతుంది. 

ఇది మన శరీరంలో 300 కంటే ఎక్కువ ఎంజైమాటిక్ ప్రతిచర్యలో పాల్గొంటుంది. చిన్న ప్రేగుల్లో ఆహార పోషకాలను గ్రహించడం లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రైట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా మెగ్నీషియం సహాయపడుతుంది. రక్తం లో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్దీకరిస్తుంది. మెగ్నీషియం శక్తితో పాటు, ప్రశాంతంగా నిద్రపట్టేలా తోడ్పడుతుంది. ఇది శరీరంలోని నరాలు, కండరాల పనితీరును నియంత్రిస్తుంది. హార్ట్‌బీట్ సమంగా ఉంచుతుంది. ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియంను శరీరం శోషించుకోవాలి. ఇందుకు మెగ్నీషియం తోడ్పడుతుంది. 

మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. వికారంగా ఉంటుం ది. వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వంటి వలక్షణాలు కనిపిస్తాయి. మన డైట్ క్రమం తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే మెగ్నీషియం లోపం నుంచి బయటపడవచ్చు. ఆకుకూరలలోనూ, అవకాడో, అరటి పండ్లల్లో మెగ్నీషియం ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సరిపోతుంది.