సూడాన్‌లో మహిళల దుర్భర పరిస్థితి
సివిల్ వార్‌లో నలిగిపోతున్న మహిళలు
ది గార్డియన్ పత్రిక కథనంలో సంచలన విషయాలు
న్యూఢిల్లీ, జూలై 22 : గత కొంత కాలంగా సైన్యం, పారామిలిటరీ మధ్య జరుగుతున్న ఘర్షణతో ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో మ హిళలు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. తినడానికి తిండి దొరక్క తీవ్ర అవ స్థలు పడుతున్నారు. ఒక్కపూట కడుపు నింపుకోవాలన్నా సైన్యం చేతిల్లో లైంగికంగా నలిగిపోవాల్సిన దుస్థితి తలెత్తింది. సూడాన్‌లోని ఒమ్దర్‌మన్ పట్టణంలోని కొందరు మహిళలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితి పై ది గార్డియన్ పత్రిక కథనం ప్రచురించిం ది. పట్టణంలో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల చాలా మంది పారిపోగా.. దాదాపు 24 మంది మహిళలు వారి కుటుంబాలతో స హా చిక్కుకుపోయారు. ఇక్కడ ఆహారం కేవలం సైన్యం వద్ద మాత్రమే లభిస్తోంది.
ఇ క్కడ ఫ్యాక్టరీలోనే వారు అత్యధిక ఆహారం నిల్వలు ఏర్పాటు చేశారు. ఇంట్లోని వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలకు ఆహారం తీసుకొనేందుకు వచ్చిన మహిళలతో సైనికులు లైంగిక వాంఛ తీర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని బాధిత మహిళలే స్వయంగా మీడియాకు వె ల్లడించారు. అంతర్యుద్ధం మొదలైన తొలినాళ్లల నుంచే ఈ పరిస్థితి నెలకొంది. అప్పట్లో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య ఘర్ష ణ తలెత్తి ఈ సివిల్ వార్‌కు దారి తీసింది. రె ండు వర్గాలు తమను లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళలు గగ్గోలు పెడుతున్నారు. “ఇటువంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రా వొద్దు. కేవలం నా బిడ్డ ల ఆకలి తీర్చడానికే నేను వారు చెప్పినట్లు చేయాల్సి వస్తోంది” అని ఓ మహిళ విలేఖరి వద్ద వాపోయింది. కొందరు సైనికులు పాడుబడ్డ ఇళ్ల వద్దకు మహిళలను తీసుకొచ్చి వరుసగా నిల్చోబెట్టి నచ్చిన వారిని ఎంచుకొని కామ వాంఛ తీర్చుకుంటున్నారని కథనం ప్రచురించింది