calender_icon.png 20 March, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ లక్షణాలు కనిపిస్తే..

02-03-2025 12:00:00 AM

ఈ రోజుల్లో గుండె ఆగిపోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. తీవ్రమైన ఛాతీ నొప్పి ఉంటేనే గుండె ఆగిపోతుందని అనుకుంటాం. కాని అలా ఏం కాదు.. చాలాసార్లు క్రమంగా వచ్చే ఛాతీ నొప్పిని గ్యాస్ నొప్పిగా, అలసటతో ముడిపెడతారు. శరీరంలో తరచుగా ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలని చెబుతున్నారు నిపుణులు.. అవేంటో చూద్దాం..

* రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి మేల్కొంటే.. గుండె బరువుగా, భారంగా అనిపించడం.

* దగ్గినప్పుడు తెలుపు లేదా గులాబీ రంగు శ్లేష్మంతో కూడిన ద్రవం రావడం. 

* ఆకలి లేకపోవడం, వికారం.. వాంతులు అవ్వడం.. తిన్న జీర్ణం కాకపోవడం.

* మెదడుకు రక్త ప్రవాహం నెమ్మదించడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, కళ్లు మసకబారడం. 

* గుండె బలహీనంగా ఉంటే చేతులు, కాళ్లు చల్లగా మారి తిమ్మిర్లు రావడం.   

చిన్న సమస్య అయినా

మన దేశంలో గుండె ఆగిపోయే (హార్ట్ ఫెయిల్యూర్) కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి, ఒత్తిడి, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యల వల్ల ఈ సమస్య పెరుగుతుంది. గుండెపోటు లక్షణాలు కనిపించినా.. చాలామంది అశ్రద్ధ చేస్తారు.

కానీ కొన్నిసార్లు అది నిశ్శబ్దంగా కూడా దాడి చేస్తుంది. సమస్య చిన్నదే కదా అని లైట్ తీసుకుంటారు. అది కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. కాబట్టి సమస్య చిన్నగా ఉన్నప్పుడే అప్రమత్తం అవ్వడం చాలా అవసరం. 

 ప్రముఖ కార్డియాలజిస్ట్ అజయ్ కుమార్, 

రాజీవ్ గాంధీ హాస్పిటల్, ఢిల్లీ