calender_icon.png 26 October, 2024 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ మార్పులు కనిపిస్తే!

24-10-2024 12:00:00 AM

మనం జీవించడానికి గాలి ఎంత ముఖ్యమో.. నీరు కూడా అంతే అవసరం. సరిపడా నీరు తీసుకోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే ఎన్నో సమస్యలు ఎదుర్కోక తప్పదని నిపుణులు అంటున్నారు. అందుకే కచ్చితంగా ప్రతిరోజూ కనీసం నాలుగు లీటర్ల నీరును తీసుకోవాలని చెబుతున్నారు. శరీరంలో సరిపడా నీరు లేకపోతే కొన్ని లక్షణాల ద్వారా శరీరం అలర్ట్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..

* నోరు దుర్వాసన వస్తుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురైనట్లు అర్థం. ఎక్కువసేపు నీరు తాగకపోతే గొంతు పొడి బారుతుంది. దీంతో నోటిలో బ్యాక్టీరియా వ్యాప్తి పెరుగుతుంది. ఈ కారణంగా నోటిలో దుర్వాసన వస్తుంది. 

* అన్నం తీన్న కాసేపటికీ మళ్లీ ఆకలి వేస్తుండటం కూడా డీ హైడ్రేషన్ లక్షణంగా భావించాలి. డీహైడ్రేషన్‌కు గురైన సమయంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటాం. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. 

* గుండె కొట్టుకునే వేగం పెరగడం, శ్వాస తీసుకునే వేగం పెరిగినా శరీరం డీహైడ్రేషన్ సమస్యతో భాద పడుతుందని అర్థం. శరీరంలో నీరు తగ్గితే.. శరీరంలో ప్లాస్మా కౌంట్ కూడా తగ్గుతుంది. రక్త ప్రవాహం పెరుగుతుంది. దీని కారణంగా గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. 

* ఎక్కువ కాలం తలనొప్పితో బాధపడుతుంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గితే.. మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్ లభించదు. ఇది తలనొప్పికి దారి తీస్తుంది. 

* చర్మ సంబంధిత సమస్యలు వచ్చినా.. చర్మంపై గీతలు, ముడతలు పడుతుంటే, చర్మం పొడిబారినట్లు కనిపించినా.. శరీరం డీహైడ్రే షన్‌కు గురైనట్లు అర్థం చేసుకోవాలని అంటున్నారు. 

* జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కూడా శరీరంలో తగినంత నీరు లేదని అర్థం చేసుకోవాలి. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు వెంటాడుతుంటే తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.