calender_icon.png 17 January, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైలెన్స్ లేకుంటే తొక్కేస్తాం!

19-07-2024 03:55:38 AM

హనుమకొండ, జూలై 18 (విజయక్రాంతి): అధిక శబ్దాలను చేసేలా ద్విచక్ర వాహనాలకు ఏర్పాటుచేసుకున్న మాడిఫైడ్ సైలెన్సర్లను వరంగల్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ గురువారం మాట్లాడుతూ.. వరంగల్ ఎంజీఎం సెంటర్లో వాహనాల తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా బైకులకు అమర్చిన సైలెన్సర్లను సీజ్ చేశామని తెలిపారు. సుమారు 150 బైకుల సైలెన్సర్లను రోడ్డుపై ఉంచి రోడ్డురోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇక నుంచి వరంగల్ ట్రై సిటీలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఎలాంటి పరికరాలు అమర్చినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వరంగ ల్, హనుమకొండ, కాజీపేట ఇన్స్‌పెక్టర్లు రామకృష్ణ, సక్రు, నాగబాబు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.