calender_icon.png 8 January, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి నడవడిక ఉంటే సస్పెక్ట్ షీట్ తొలగిస్తాం

07-01-2025 11:36:20 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాము చెప్పిన విధంగా మంచి నడవడిక ఉంటే సస్పెక్ట్ షీట్ తొలగిస్తామని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న పనితీరుని, వర్టికల్ సిస్టం, బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ డ్యూటీల గురించి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణ పీఎస్ పరిధిలో ఉన్న సస్పెక్ట్ షీట్ కలిగిన వ్యక్తులకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ కాకూడదని, ఎట్టి పరిస్థితులలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని ఏఎస్పీ హెచ్చరించారు. ఇకపై పద్ధతులు మార్చుకోవాలని, అనవసరమైన కేసులలో తలదూర్చవద్దని, చెప్పిన విధంగా నడుచుకోకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.