calender_icon.png 25 November, 2024 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికి ఆపదొస్తే స్పందించాలి

21-10-2024 12:45:55 AM

ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ సహ వ్యవస్థ ప్రముఖ్ తిరుమలజీ

పరిగి, అక్టోబర్ 20: గత పదేళ్లుగా దేశం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుండటం గర్వకారణమని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థ ప్రముఖ్ గంట తిరుమలజీ అన్నారు. ఇందులో భాగంగానే ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, మహిళా రిజర్వేషన్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పరిగి ఖండ ఆధ్వర్యంలో 550 మంది స్వయం సేవకులతో పద సంచాలన్ కార్యక్రమం నిర్వహిం చారు. అనంతరం శిశు మందిర్ పాఠశాల మైదానంలో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంట తిరుమలజీ మాట్లాడుతూ.. దేశానికి ఎలాంటి ఆపద వచ్చినా ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. దేశంలో ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయని, ప్రస్తుతం 60 వేల గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు కొనసాగుతున్నాయని తెలిపారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా లక్ష గ్రామాలకు ఆర్‌ఎస్‌ఎస్ శాఖను విస్తరించాలని సూచించారు.