17-02-2025 06:01:18 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటికి పరిష్కార మార్గం చూపెడతామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాధితులకు హామీ ఇచ్చారు. సోమవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన అర్జీలని స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. పోలీసులు మీకోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది ఉన్నారు.