calender_icon.png 5 March, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతల సమస్యలు వస్తే పోలీస్‌లను సంప్రదించాలి

05-03-2025 12:00:00 AM

కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి 

కామారెడ్డి, మార్చి 4 (విజయక్రాంతి): శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడు పోలీసులను సంప్రదించాలని కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో కవాతును నిర్వహించారు.

జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఆదేశాల మేరకు  కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో  రైల్వే స్టేషన్ రోడ్, డైలీ మార్కెట్, సుభాష్ రోడ్, పాన్ చౌరస్తా బడా మసీద్, నిజం సార్ చౌరస్తా, కొత్త బస్టాండ్, రైల్వే గేట్ బతుకమ్మ కుంట, పాత బస్టాండ్  తదితర ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి  మాట్లాడుతూ*  ఆర్.ఏ.ఎఫ్  మన జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మరియు మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి యాకూబ్ రెడ్డి, కామారెడ్డి టౌన్ ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్‌ఐలు సంతోష్ కుమార్,  కృష్ణ,  రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టిపి బగేల్, ఇన్స్పెక్టర్లు హరిబాబు, మల్లేశ్వరరావు, ఆర్‌ఎఎఫ్ సిబ్బంది,  పోలీస్ సిబ్బంది 145 మంది ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు.