calender_icon.png 25 November, 2024 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోరిక తీరిస్తే.. సమస్య పరిష్కరిస్తా

25-11-2024 02:20:10 AM

కోరిక తీరిస్తే.. సమస్య పరిష్కరిస్తా?l

  1. భర్త కనిపించడం
  2. లేదంటూ పోలీసులను ఆశ్రయించిన మహిళ 
  3. బాధితురాలితో హయత్‌నగర్
  4. ఎస్సై అసభ్య ప్రవర్తన!
  5. భరించలేక రాచకొండ సీపీకి బాధితురాలి ఫిర్యాదు

ఎల్బీనగర్, నవంబర్ 24: న్యాఎల్బీనగర్, నవంబర్ 24: న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఓ మహిళకు పోలీసుల నుంచి వేధింపులు మొదలయ్యా యి. న్యాయం  చేయాల్సిన స్థానంలో ఉన్న ఎస్సై నిత్యం ఫోన్ చేసి మానసికంగా, శారీరకంగా వేధిసున్నాడని బాధిత మహిళ ఆది వారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ చెందిన పావనికి రెండో భర్తతో విభేదాలు రావడంతో.. 

అతడు ఆమెను వదిలి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తన భర్త ఆచూకీ కనుగొనడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పావని హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై సైదులు.. బాధితురాలి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఈ క్రమంలో సదరు ఎస్సై తరుచూ ఫోన్ చేస్తూ.. ‘నీ కేసు నేను పరిష్కరిస్తా.. మీ ఇంటికి వస్తా’ అని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.

నీ భర్తపై కేసు నమో దు చేయాలంటే నా కోరిక తీర్చాలంటూ వేధించాడని తెలిపింది. ఈ క్రమంలో ఎస్సై సైదులు వేధింపులు తట్టుకోలేక రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు వివరించింది. 40 రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తనవద్ద  ఉన్నాయని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

ఎస్సై వేధింపులు అవాస్తవం..

హయత్‌నగర్ ఎస్సైపై పావని చేసిన ఆరోపణలు అవాస్తవమని సీఐ నాగరాజుగౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడు తూ.. తన రెండో భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని.. ఇప్పుడు అతడు కనిపించడం లేదని అతడి ఆచూకీ కనిపెట్టడంతో పాటు అతడి దగ్గర నుంచి.. కారు, బం గారం, డబ్బులు ఇప్పించాలని పావని.. ఎస్సై సైదులును సంప్రదించినట్లు వివరించారు.

ఈ మేరకు ఆమె హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా పావని రెండో భర్తను ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు గుర్తించారు. అయితే పావనితో తాను ఉండలేనని అతడు తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో తన రెండో భర్త దగ్గర ఉన్న కారు తనకు ఇప్పించాలని హయత్‌నగర్ పోలీసులపై పావని ఒత్తిడి చేసిందన్నారు. తన తల్లి పేరు మీద ఉన్న కారుకు తానే ఈఎంఐ కడుతున్నట్లు పావని రెండో భర్త పేర్కొన్నాడు.

అయినప్పటికీ హయత్‌నగర్ పోలీసులు పావనికి కారు ఇప్పిం చారు. ఇదీ చాలదని.. కారుతో పాటు బంగారం, నగలు ఇప్పించాలని మళ్లీ పోలీసులపై పావని ఒత్తిడి తెచ్చిందని.. బంగా రం, నగదు మేము ఇప్పించలేమని.. ఇది సివిల్ కేసు అని.. కోర్టుకు వెళ్లాలని సూచించామన్నారు. అయితే తాను న్యాయవాదినంటూ కేసు పరిష్కరించాలని పోలీసులపై పావని ఒత్తిడి తెచ్చినప్పటికీ ఎస్సై సైదులు ఇది తన పరిధిలోకి రాదంటూ కరాఖండిగా చెప్పారని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. తన కేసును పరిష్కరించడం లేదనే అక్కసుతోనే.. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై సైదులు వేధింపులకు గురిచేస్తున్నాడని తప్పుడు ఆరోపణ లు చేస్తున్నట్లు వివరించారు. పావని.. ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సీఐ నాగరాజుగౌడ్ తెలిపారు.