calender_icon.png 19 March, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి శాతం తగ్గితే..

02-03-2025 12:00:00 AM

ఒంట్లో నీటి శాతం తగ్గినా గుండెదడ పుడుతుంది. సాధారణంగా ఇది ప్రమాదకరం కాదు. అరుదుగా వస్తుంది. కొద్దిసేపు ఉండి పోతుంది. కానీ నీటిశాతం తగ్గటం వల్ల గుండెదడ పుడితే మాత్రం తీవ్రంగానే పరిగణించాలి. గుండెరక్తనాళాల వ్యవస్థ ఒత్తిడికి గురైందనటానికిది సంకేతం కావొచ్చు. గుండెదడకు, నీటిశాతం తగ్గటానికీ మధ్య సంబంధం ప్రధానంగా శరీరంలోని ద్రవాల మోతాదుతోనే ముడిపడి ఉంటుంది.

నీటిశాతం తగ్గితే రక్తం పరిమాణం తగ్గుతుంది. దీన్ని భర్తీ చేసుకోవటానికి గుండె మరింత వేగంగా కొట్టు కుంటుంది. రక్తాన్ని పంప్ చేయటానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తేలికపాటి వ్యాయామం, శారీరక శ్రమ చేసినా గుండె వేగం మరింత ఎక్కువవుతుంది. నీటిశాతం తగ్గటం వల్ల ఎలక్ట్రోలైట్ల సమతుల్యత కూడా అస్తవ్యస్తమవుతుంది.

దీంతో గుండె, రక్తనాళాలు ఒత్తిడికి గురై గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. గుండెదడకు కారణాన్ని గుర్తించటం అంత తేలిక కాదు. కానీ నీటిశాతం తగ్గటం కారణమవుతుంటే మాత్రం కొన్ని లక్షణాలతో గుర్తించొచ్చు.

మలబద్ధకం, మూత్రం గాఢ రంగులో రావటం, మూత్రం తగ్గటం, తలతిప్పు, తల తేలినట్టు అనిపించటం, నోరు ఎండటం, నిస్సత్తువ, తలనొప్పి, కండరాలు పట్టేయటం, వికారం వంటి లక్షణాలు కూడా ఉన్నట్టయితే నీటి శాతం తగ్గటమే ఇందుకు కారణమని భావించాలంటున్నారు నిపుణులు.