calender_icon.png 23 February, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్ల పాలన పోవాలంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి

22-02-2025 12:52:21 AM

బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి):  ఎమ్మెల్సీ ఎన్నికల లో బీసీలంతా ఏకమై బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. శుక్రవారం నాడు భువనగిరిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ అభ్యర్థి పూల రవీందర్ ను గెలిపించడం ద్వారా బీసీల రాజకీయ శకం ప్రారంభమవుతుందని అన్నారు. బీసీలే  రాష్ట్ర రాజకీయాలను శాసించబోతున్నారని అన్నారు.

పార్టీలకతీతంగా బీసీ అభ్యర్ధి పూల రవీందర్ ను బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ  ఉపాధ్యాయులంతా  సంఘటితమై గెలిపించాలని కోరారు. నల్లగొండ జిల్లాలో రెడ్ల రాజకీయాలకు అడ్డుకట్ట వేసి, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి బీసీ సీఎం కావడం ఖాయమని  అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి అన్ని ఉపాద్యాయ సంఘాలు గెలుపు గుర్రాల పెరుతో రెడ్లకు బి పామ్ లు ఇచ్చాయని, బీసీలకు మాత్రం టికెట్లు  నిరాకరించి బహుజనులను అవమానించారని అన్నారు.

ఈ ఎన్నికలలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం నియోజక వర్గంలో ఓటును ఆయుధంగా చేసుకుని రెడ్ల పాలనకు బహుజనులు అంత ఏకమై వారికి చరమగీతం పాడాలంటే ప్రస్తుతం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘బీసీల ఓటు బీసీలకే  వేయాలన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర చట్టసభలలో ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 43 ఎమ్మెల్యేలు  ఉన్నారని 17 మంది పార్లమెంట్ సభ్యులలో పదిమంది ఎంపీలు ఉన్నారని, మళ్లీ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా బీసీలు తమకు తామే రాజకీయ సమాధి చేసుకుంటారనే విషయాన్ని  గ్రహించాలని కోరారు.

ఈ సమావేశంలో, బీసీసంక్షేమ సంఘంజిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, భువనగిరి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సాబన్ కార్ వెంకటేష్, యాదగిరిగుట్ట మండలం అధ్యక్షులు అశోక చారి, వలిగొండ మండలం అధ్యక్షులు సాయిని యాదగిరి, ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు పేరపురాములు, కంబాలపల్లి శ్రీరాములు, వట్టిపల్లి రాజు, పల్లె రాజాలు గౌడ్, తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.