calender_icon.png 17 November, 2024 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉదృతం

17-11-2024 07:46:06 PM

ఎఐటీయుసి బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ 

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆద్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి గనులు, డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న కార్మికులకు పనిముట్లు సకాలంలో ఇవ్వడం లేదని, గ్లౌజులు, షూస్ వంటి రక్షణ పనిముట్లు నాణ్యమైనవి వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

చలికాలం తీవ్ర రూపం దాల్చిందని కార్మికులకు గరం కోట్స్ పంపిణీ చేయాలని, డిస్పెన్సరీలలో వైద్యానికి సరిపడా సిబ్బంది లేరని వెంటనే భర్తీ చేయాలని కోరారు. కేకే ఓసీపీ లోని ఉద్యోగులకు హెచ్ఆర్ఎ చెల్లించాలని కోరుతూ గతంలో అనేకసార్లు యాజమాన్యానికి విన్నవించడం జరిగిందని అయినప్పటికి యాజమాన్యం నిమ్మకు నీరేత్తిన విదంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రెటరీ సోమిశెట్టి రాజేశం, జాయింట్ సెక్రెటరీ కంది శ్రీనివాస్, ఏరియా నాయకులు పి బాణయ్య, ట్రేడ్ మెన్ ఇన్చార్జి టేకుమట్ల తిరుపతి, ట్రెజరర్ సుదర్శన్ రెడ్డి, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, ఫిట్ సెక్రటరీలు గాండ్ల సంపత్, మర్రి కుమార్, ప్రభాకర్, శర్మ, కల్వల శ్రీనివాస్, కె.ఓదెలు పాల్గొన్నారు.