ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్టప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఈ వచ్చే నెల 5న వేలాది మందితో ‘ఛల్ బస్ భవన్’ చేపట్టి బస్ భవన్‌ను ముట్టడిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కో-కన్వీనర్లు కత్తుల యాద య్య, సుద్దాల సురేశ్, వి.బాబు హెచ్చరించా రు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని ఆరోపించారు. ఆర్టీసీ పరిధిలో యూనియన్ల పునరు ద్ధరణ, గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ, సంస్థను ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేస్తామని చెప్పి కూడా ఒక్క హామీనైనా నెరవేర్చ లేదని మండిపడ్డారు. అలాగే ప్రజాపాలన విజయోత్సవాల్లో తమను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు.
సాఫ్ట్‌వేర్‌ను సరిచేయండి
మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు కండక్టర్లు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టిమ్స్ సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని ఎస్‌డ బ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 11 రకాల సాఫ్ట్‌వేర్ సమస్యలతో కండ్లక్టర్లు సతమతమవుతున్నారని స్పష్టం చేశారు.
టిమ్ సమస్యలతో నెలకు సగటున 10 మంది కండక్టర్లు ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. కండక్టర్లు జీరో టికెట్ ఇచ్చిన తర్వాత, కాన్సిల్ చేయకపోతే పెయిడ్ టికెట్ బటన్ నొక్కినా జీరో టికెట్ వస్తున్నదని పేర్కొన్నారు. ఆ విధానాన్ని మార్చి క్యాన్సిల్ చేయకుండా పెయిడ్ టికెట్ వచ్చేలా మార్పులు చేయాలన్నారు. అంతరాష్ర్ట సర్వీసుల్లో బోర్డర్ దాటిన తర్వాత జీరో టికెట్ రాకుండా సాఫ్ట్‌వేర్‌లో తక్షణం మార్పులు చేయాలన్నారు.