హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై మరో ఉద్యమం తప్పదని వివిధ పార్టీ నాయకులతో పాటు ప్రజాసంఘాలు హెచ్చరించాయి. మా ఇల్లు మాకు కావాలంటూ హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో బుధవారం నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రెస్ క్లబ్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ హుజూరాబాద్ లోని ప్రధాన వీధుల గుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అంబేద్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కళాకారులు ఆటపాట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ... గత 20 సంవత్సరాలుగా జర్నలిస్టులు ఎంతో కష్టపడి సాధించుకున్న నివేషణ స్థలాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు.
ఇప్పటికైనా నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తో పాటు మంత్రి పొన్న ప్రభాకర్ వెంటనే చొరవ చూపి వారికి పూర్తిస్థాయిలో ఇల్లు కట్టించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు వారికి అండగా ఉంటామని, వారితోపాటు కలిసి నిరసనలో పాల్గొంటామని అన్నారు. జర్నలిస్టుల సమస్యపై ప్రభుత్వం కాలయాపన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని హెచ్చరించారు. జర్నలిస్టుల నిరసనకు బిఆర్ఎస్, బిజెపి వామపక్ష పార్టీలు సిపిఐ, సీపీఎం లతోపాటు ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. అనంతరం కేసి క్యాంపు కు బైకు ర్యాలీ ద్వారా వెళ్లి ఆర్డిఓ ఏఓ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ నిరసన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్ లు కాయిత రాములు,నిమ్మటూరి సాయి కృష్ణ, టీయు డబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు నంబి భరణి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్, జిల్లా నాయకులు చిలుకమారి సత్యరాజ్, వేల్పుల సునీల్, బొడ్డు శ్రీనివాస్ తో పాటు సీనియర్ జర్నలిస్టులు కోరం సుధాకర్ రెడ్డి, మామిడి రవీందర్, అల్లి నరేందర్, మండల యాదగిరి, కామని రవీందర్, పిల్లల సతీష్, గుడూరు కొండల్ రెడ్డి, సురుకంటి తిరుపతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక, బిఆర్ఎస్ నాయకుడు గందే శ్రీనివాస్, బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, ప్రజాసంఘాల నాయకులు వేల్పుల రత్నం, సందుపట్ల జనార్ధన్, పొడిశేట్టి వెంకటరాజం, మార్త రవీందర్ ,విష్ణు దాస్ గోపాలరావు, బత్తుల మనోజ్ తోపాటు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. శనిగరపు బాబ్జి కళాబృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.