calender_icon.png 4 January, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖైదీలు సత్ప్రవర్తనతో ఉంటే బెయిల్ ఇప్పిస్తా

02-01-2025 12:32:37 AM

  1. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  2. హుజూర్‌నగర్ సబ్‌జైలును సందర్శించిన మంత్రి 

హుజూర్‌నగర్, జనవరి 1: సత్ప్రవర్తన కలిగిన అండర్ ట్రయల్ ఖైదీలకు బెయిల్ ఇప్పించేందుకు తగిన సహకారం అందిస్తామని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం హుజూర్‌నగర్‌లోని సబ్ జైలును ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి ఖైదీలతో మాట్లాడారు. వంటగదిలో సామగ్రిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్షణికావేశాలకు పోయి కుటుంబాలను ఇబ్బందు ల్లోకి నెట్టొద్దన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.

అంతకుముందు మేళ్లచెర్వులోని శివాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు చేసి శివరాత్రి జాతర ఏర్పాట్ల సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, జైలు సూపరింటెండెంట్ మంగ్తనాయక్, సిబ్బంది, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 

విద్య ద్వారానే గుర్తింపు 

విద్య ద్వారానే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని ముస్లిం మైనార్టీ బాలకల పాఠశాలను బుధవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డిలతో కలిసి సందర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభు  ్వం విద్యకు తగిన ప్రాధాన్యతనిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యానారాయణ, జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ వాజిద్, పాఠశాల ప్రిన్సిపాల్ మాధురిశర్మ పాల్గొన్నారు.