- గాంధీభవన్ మెట్లపై ధర్నా చేస్తా
- కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): తనను ఎమ్మెల్సీని చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, తనకు నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీభవన్ మెట్లపై ధర్నా చేసి పీసీసీ చీఫ్‌ను అడ్డుకుంటానని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు హెచ్చ రించారు. బీసీ మహిళగా, ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి తనకు అ న్ని రకాల అర్హతలు ఉన్నాయని, తనకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని డి మాండ్ చేశారు.
గురువారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడు తూ.. పార్టీ కోసం తాను ఎంతో శ్రమిస్తున్నానని, మహిళా కాంగ్రెస్‌పైన 150కి పైగా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో మహిళలకు న్యాయం చేయాలని కోరారు. కాగా, గత అసెంబ్లీ ఎ న్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన సునీతారావు ఓటమి పాలయ్యా రు. తన పదవి విషయంలో కొంత కాలంగా ఆమె అసంతృప్తితో ఉన్నారు.