calender_icon.png 31 October, 2024 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ వచ్చిందని పార్టీ ఇస్తే..

31-07-2024 02:56:10 AM

  1. స్నేహితురాలిపై యువకుడి లైంగికదాడి 
  2. సహకరించిన మరో యువకుడు 
  3. వనస్థలిపురం పీఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు 
  4. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

ఎల్బీనగర్, జూలై 30 (విజయక్రాంతి): ఉద్యోగం వచ్చిందనే సంతోషంతో పార్టీ ఇచ్చిన స్నేహితురాలిపై చిన్ననాటి స్నేహితుడు తన మిత్రుడితో కలిసి లైంగికదాడికి పాల్పడిన అమానవీయ ఘటన వనస్థలిపురం పీఎస్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తెలిపిన వివరాలు... నగరానికి చెందిన ఓ యువతి(24)కి ఇటీవల ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. హయత్‌నగర్ డివిజన్‌లోని లెక్చరర్ కాలనీకి చెందిన ఎడ్ల గౌతమ్‌రెడ్డి(26) బాధితురాలికి చిన్ననాటి స్నేహితుడు. ఈ క్రమంలో ఉద్యోగం వచ్చింది కదా.. పార్టీ ఇవ్వాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చాడు. పార్టీ ఇచ్చేందుకు పకున్ని యువతి సోమవారం వనస్థలిపురానికి వచ్చింది. అనంతరం ఇద్దరూ కలిసి ఓంకార్‌నగర్‌లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ క్రమంలో గౌతమ్‌రెడ్డి మద్యం తాగడంతో పాటు బాధితురాలికి బలవంతంగా తాగించాడు. ఈ క్రమంలో బాధితురాలు సృహ కోల్పోయింది. దీంతో గౌతంరెడ్డి బాధితురాలిని రెస్టారెంట్ కింద ఉన్న హోటల్ గదిలోకి తీసుకెళ్లాడు. అప్పటికే పథకం ప్రకారం గౌతంరెడ్డి తన స్నేహితుడైన హయత్‌నగర్‌లోని భాగ్యలతకాలనీకి చెందిన మునగాల శివాజీరెడ్డి ని ఇదే హోటల్‌కి రప్పించాడు. బాధితురాలు మద్యం మత్తు లో ఉండగానే గౌతమ్‌రెడ్డి, అతడి స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. తదనంతరం బాధితురాలు స్పృహలోకి రావడంతో.. విషయాన్ని రెస్టారెం ట్ సిబ్బందికి తెలపగా అప్పటికే ఆ ఇద్దరూ అక్కడినుంచి పరారయ్యారు.

బాధితురాలు విషయాన్ని తన స్నేహితులకు చెప్పడంతో వారు వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్థానికంగా ఉన్న దవాఖానకు తరలించారు. నిందితులు రూమ్ బుక్‌చేసుకునేందుకు ఇచ్చిన గుర్తింపు కార్డులను హోటల్ నిర్వాహకులు పోలీసులకు అందజేశారు. ప్రధాన నిందితుడు గౌతమ్‌రెడ్డిని అరెస్టు చేశామని.. మరో నిందితుడు శివాజీరెడ్డి పరారీలో ఉన్నట్లు ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు. బాధితురాలు దళితురాలు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం నమోదు చేసినట్లు వివరించారు. పరారీలో ఉన్న నిందితుడు త్వరలో పట్టుకుంటామన్నారు.