calender_icon.png 14 January, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి జన్మనిస్తే, వైద్యుడు జీవం పోస్తున్నాడు

02-12-2024 11:51:34 PM

రామగుండంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ 

పెద్దపల్లి (విజయక్రాంతి): తల్లి జన్మనిస్తే, వైద్యుడు జీవం పోస్తున్నాడని రామగుండంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలనలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఉన్న హిజ్రాలను దృష్టిలో ఉంచుకొని మైత్రి ట్రాన్స్ క్లినిక్ సమగ్ర వైద్యం సమాన గౌరవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ప్రత్యేక వైద్య విభాగాన్ని ప్రారంభించి, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యపు పాలనలో అసంపూర్తిగా వదిలేసిన మెడికల్ కాలేజీని పూర్తిస్థాయిలో నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో  పూర్తి చేస్తున్నామని, నేటితో గడీల పాలనకు తెరపడి ప్రజాపాలన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పూర్తిస్థాయిలో మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేయనున్నారు.  రామగుండంలో నాణ్యమైన వైద్యం ప్రతి నిరుపేదకు అందే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, తల్లి  జన్మనిస్తే వైద్యుడు జీవం పోస్తున్నాడని, వైద్యుడు దైవంతో సమానమని దేవుడి తర్వాత అంతలా రెండు చేతులెత్తి మొక్కే ప్రతిరూపం వైద్యుడు అన్నారు.

ఇక్కడున్న విద్యార్థులంతా మదర్ తెరిసాను ఆదర్శవంతంగా తీసుకొని ఉన్నతమైన వైద్యులుగా అవతరించాలని, ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానానికి చేరుకోవాలని సమాజంలో వైద్యులకు వైద్య రంగానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్, మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ తో పాటు ప్రముఖ వైద్య నిపుణులు, రామగుండం కార్పొరేషన్ మేయర్ బండి అనిల్ కుమార్, కార్పొరేటర్లు, ఆయా విభాగాల అధ్యక్షులు నర్సింగ్ కళాశాల విద్యార్థులు సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.