calender_icon.png 10 January, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్ధతి మార్చుకోకపోతే శిక్ష తప్పదు

02-11-2024 02:21:08 AM

మావోయిస్ట్ కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ హెచ్చరిక

బెల్లంపల్లి, నవంబర్ 1 (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, ధన దాహంతో అరాచకాలకు పాల్పడుతున్నారని, వారి పద్ధతి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని శుక్రవారం మావోయిస్ట్ సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో గురువారం ఓ లేఖ విడుదలైంది.

ప్రజలకు కృతజ్ఞతగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాల్సిన ఎమ్మెల్యే వినోద్ కొందరిని ముఠాగా ఏర్పాటు చేశారని, తన పీఏ ప్రసాద్‌ను బినామీగా పెట్టుకొని నియోజకవర్గంలో భూకబ్జాలకు ప్రోత్సహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వారి ఆగడాలతో ప్రజలు పది నెలలుగా ఇబ్బందిపడుతున్నారన్నారు.